హనుమాన్ ఆలయంలో చోరీ

74చూసినవారు
హనుమాన్ ఆలయంలో చోరీ
నిర్మల్ పట్టణం సోఫీ నగర్ తారకనామ్ నగర్ లోని హనుమాన్ ఆలయ హుండీ చోరీకి గురైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, ఆలయ పూజారి తెలిపిన వివరాల మేరకు మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చి చూడగా హుండీ కనిపించలేదని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్