2024 సంవత్సరానికి కేంద్ర పర్యాటక శాఖ 8 కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ పర్యాటక గ్రామం క్రాప్స్ కేటగిరిలో నిర్మల్ జిల్లాకు అవార్డు గెలుచుకుంది. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షికావత్ చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు పెంటయ్య అవార్డును అందుకున్నారు.