ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించడంతోపాటు తాగునీటి అవసరాలు తీర్చే బహుళార్ధ ప్రాజెక్టు కడెం మరమ్మతులు పూర్తయ్యాయి. ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్టుపై పరిస్థితిపై పలుసార్లు నివేదించారు. అయితే ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు మంజూరు చేయడంతో మరమ్మతులు ఆదివారం పూర్తయ్యాయి.