విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మండల విద్యాధికారి శంకర్ అన్నారు. శనివారం దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో అండర్ 14 బాల, బాలికల కబడ్డీ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, రవీందర్ గౌడ్, శ్రీనివాస్, రమణ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.