హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలు శిక్ష

79చూసినవారు
హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలు శిక్ష
వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురికి ఆసిఫాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్ కోర్ట్ జడ్జి మంగళవారం జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు కౌటాల సీఐ రమేశ్ పేర్కొన్నారు. గుండాయిపేటకు చెందిన సాయిరాం అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని శంకర్, పంకజ్, సందీప్ కలిసి సాయిరాంను కొట్టి బావిలో పడేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపర్చగా, జడ్జి వారికి జైలు శిక్ష విధించారు.

సంబంధిత పోస్ట్