బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మంగళవారం ఉదయం ఆయన్ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. న్యూరాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయని ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు.