మళ్లీ చాన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం: కేటీఆర్‌

84చూసినవారు
మళ్లీ చాన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం: కేటీఆర్‌
6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్‌ పాలనలో ఆవిష్కృతమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎక్స్ వేదికగా విమర్శించారు. 'పదేళ్లు కనిపించని కరెంట్‌ కోతలను మళ్లీ చూస్తున్నాం. మళ్లీ చాన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం. ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నాం. రైతుబంధు కోసం పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాం' అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

సంబంధిత పోస్ట్