కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్‌ల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో సోమవారం ఉదయం యూపీ రైతులు నోయిడా నుంచి ఢిల్లీ వరకు మార్చ్ నిర్వహించటంతో.. ఢిల్లీ-నోయిడా సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.