పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ అవినీతి అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. కాగా.. అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే.