6 నెలల్లోనే వ్యవసాయాన్ని ఆగం చేశారు: కేటీఆర్‌

76చూసినవారు
6 నెలల్లోనే వ్యవసాయాన్ని ఆగం చేశారు: కేటీఆర్‌
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Xలో పలు ప్రశ్నలు సంధించారు. 'రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా. విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు?. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ?. ముందుచూపు లేని సీఎం జాడేది?. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా?. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేవాడు లేడు.. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేవాడు లేడు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వ్యవసాయాన్ని ఆగం చేశారు' అని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్