Video: పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

2202చూసినవారు
హైదరాబాద్​లో చిన్నారులను అక్రమంగా అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో మొత్తం 14 మంది ఉండగా.. 11 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ముఠా సభ్యుల నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్టు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్