ఢిల్లీలో ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్(46)పై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఎయిర్ హోస్టెస్ గురుగ్రామ్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో జారిపడ్డారు. దీంతో ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతుండగా ఈ ఘటన జరిగింది. డిశ్చార్జ్ అయిన వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.