AP: కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలు ఈ తరానికి స్పూర్తిదాయకమని గుర్తు చేశారు. ‘స్త్రీ జనోద్దరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆశయాలు ఈ తరానికి స్పూర్తిదాయకం’ అని జగన్ ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.