సీఎం రేవంత్ రెడ్డిపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మరోసారి తన అభిమానం చాటుకున్నారు. రేవంత్ ఫోటోతో కూడిన పతంగులు తయారు చేయించి పిల్లలకు పంచారు. గతంలో సీఎం జన్మదినం సందర్భంగా పూరీలో రేవంత్ సైకత శిల్పం తయారు చేయించారు. తాజాగా రేవంత్ ఫోటోతో గాలిపటాలు తయారు చేయించారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న రేవంత్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన కోరారు.