ఆదిలాబాద్‌లో త్వరలోనే విమానాశ్రయం ఏర్పాటు కానుంది. జిల్లాలోని వైమానిక విమానాశ్రయంలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల లేఖ రాశారు. అయితే ఈ లేఖపై తాజాగా రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. వైమానికి విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు కొనసాగించేందుకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో త్వరలోనే విమానాశ్రయం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.