యశస్వి జైస్వాల్‌పై ఆకాశ్ చోప్రా ప్రశంసలు

58చూసినవారు
యశస్వి జైస్వాల్‌పై ఆకాశ్ చోప్రా ప్రశంసలు
టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్‌ను మరిపిస్తున్నారని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. జైస్వాల్ తొలి రోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, అతడు ఆడిన విధానం తనను కట్టిపడేసిందని తెలిపారు. సీనియర్ బౌలర్ అండర్సన్ బౌలింగ్‌ను గౌరవిస్తూ స్పిన్నర్లను ఉతికారేశారని అన్నారు. ఎలాంటి భీతి లేకుండా సిక్స్‌తో సెంచరీ పూర్తి చేయడం అతడి ధైర్యానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్