ఎయిర్‌ఫైబర్‌ యూజర్ల కోసం జియో రెండు కొత్త ప్లాన్స్‌

84చూసినవారు
ఎయిర్‌ఫైబర్‌ యూజర్ల కోసం జియో రెండు కొత్త ప్లాన్స్‌
ఎయిర్‌ఫైబర్‌ వినియోగదారుల కోసం రిలయన్స్‌ జియో మరో రెండు కొత్త ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అయితే, ఇవి అదనపు డేటా వినియోగం కోసం డేటా బూస్టర్‌ ప్లాన్స్‌. వీటి ధరలను రూ.101, రూ.251గా జియో నిర్ణయించింది. రూ.101 ప్లాన్‌తో 100 జీబీ, రూ.251 ప్యాక్‌తో 500 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్లకు ప్రత్యేక గడువంటూ ఉండదు. బేస్‌ ప్లాన్‌ గడువే వీటికీ వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్