లెమన్ టీ తీసుకుంటే జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. తద్వారా బరువు వేగంగా తగ్గుతారు. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. నిమ్మకాయలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఐరన్ లోపాన్ని నివారించడానికి పనిచేస్తుంది. అధిక రక్తపోటు సమస్య నుంచి లెమన్ కాపాడుతుంది. కొంచెం అల్లం జోడిస్తే కండరాల నొప్పిని తగ్గిస్తుంది.