ఏపీలో కూటమిదే విజయం: చంద్రబాబు

29302చూసినవారు
ఏపీలో కూటమిదే విజయం: చంద్రబాబు
ఏపీలో కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేశారని కితాబిచ్చారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి అభ్యర్థులకు సూచనలు చేశారు. కౌంటింగ్‌ రోజు అల్లర్లకు పాల్పడేందుకు వైసీపీ ప్రణాళికలు వేస్తోందని చంద్రబాబు అన్నారు. డిక్లరేషన్‌ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు రావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్