తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ.. కంపార్టుమెంట్లన్నీ ఫుల్

65చూసినవారు
తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ.. కంపార్టుమెంట్లన్నీ ఫుల్
క‌ళియుగ వైకుంఠం తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ నెల‌కొంది. భ‌క్తుల‌తో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. వెంక‌టేశ్వ‌రుని సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. నిన్న‌(శ‌నివారం) 78,686 మంది భక్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. 37,888 మంది భ‌క్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లుగా లెక్క తేలింద‌ని టీడీడీ అధికారులు వెల్ల‌డించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్