భార్య పై అనుమానంతో గొంతుకోసి హత్య చేసిన భర్త

72చూసినవారు
భార్య పై అనుమానంతో గొంతుకోసి హత్య చేసిన భర్త
భోపాల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన మే 21న జరిగింది. కూతురు అదృశ్యమైందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మహిళను హత్య చేసినట్లు ఆమె భర్త అంగీకరించాడు. తన భార్యపై కోపంతో గొంతు కోసి చంపి, మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి ఓ ప్రదేశంలో కిరోసిన్ పోసి తగలబెట్టాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్