లొంగిపోయిన సీఎం

588చూసినవారు
లొంగిపోయిన సీఎం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ముగియడంతో తిరిగి జైలుకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, పార్టీ నేతలందరినీ కలిసి నేరుగా తీహార్ జైలుకు వెళ్లనున్నారు. కాగా ఆయన ఇప్పటికే ఢిల్లీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పిటిషన్ జూన్ 5న విచారణకు రానుంది.

సంబంధిత పోస్ట్