తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని కోర్టు తేల్చి చెప్పింది. 'యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేము. అల్లు అర్జున్‌కి కూడా జీవించే హక్కు ఉంది. కేవలం నటుడు కాబట్టే 105(B),118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా? రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రన నేరాన్ని ఒక్కరిపైనే రుద్దలేం' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.