అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే ‘బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్’ సంస్థ తెలంగాణలో రూ.700కోట్లతో యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చిందని, ఈ యూనిట్ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయడానికి ఎక్సైజ్ విధానంలో మార్పులు చేయాల్సి ఉంటుందని.. దీనిపై సీఎం రేవంత్, ఎక్సైజ్ మంత్రి జూపల్లితో చర్చిస్తానని తెలిపారు..