చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు

54చూసినవారు
చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు
TG: నల్లగొండ జిల్లాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి గుండా కార్తికేయ చెస్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. 180 చదరంగం బోర్డులపై ఏకదాటిగా.. అత్యంత వేగంగా పావులు కదుపుతూ.. కేవలం 9.41 నిమిషాల్లో చెక్‌ మేట్లు పెట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో ఇదే సమస్యను 11:59 నిమిషాల్లో పరిష్కరించి ప్రపంచ రికార్డు సాధించిన నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. దీంతో నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు.

సంబంధిత పోస్ట్