ప్రఖ్యాత మానసిక నిపుణుడు, మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సండ్ర తన తొలి అమెరికా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని డల్లాస్ నగరంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఆయన సోదరి మౌనిక మరియు బావ మహేష్ ఆధ్వర్యంలో అక్కడి తెలుగు కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
మార్చి 26 వ తారిఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో అనేక తెలుగు కుటుంబాలు పాల్గొని, పిల్లల మానసిక ఆరోగ్యం, సంస్కృతి విలువలు, డిజిటల్ డీటాక్స్, తల్లిదండ్రులతో బంధం బలపడే మార్గాలు వంటి కీలక అంశాలపై సుధీర్ సండ్ర సూచనలు అందించారు.
తల్లిదండ్రులు ముఖ్యంగా అడిగిన ప్రశ్నలు:
పిల్లల మనసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచాలి?
అమెరికా, భారతీయ సంస్కృతుల మధ్య సంతులనం ఎలా నిలబెట్టాలి?
ఫోన్, స్క్రీన్ మీద ఆధారాన్ని ఎలా తగ్గించాలి?
పిల్లలతో ఎమోషనల్ కనెక్షన్ ఎలా పెంచుకోవాలి?
ఈ సందర్బంగా సుధీర్ సండ్ర మాట్లాడుతూ,
"పిల్లలతో మానసికంగా బంధాన్ని పెంపొందించాలంటే, వారిని వినడం, అర్థం చేసుకోవడం, ఒక ప్రేరణాత్మక వాతావరణం కల్పించడం ముఖ్యం. స్క్రీన్ టైమ్ తగ్గించి, రిలేషన్‌షిప్ టైమ్ పెంచడం వల్లే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది" అని తెలిపారు.
ఇటీవలి ట్రెండ్‌గా మారుతున్న డిజిటల్ డీటాక్స్ పద్ధతులను తల్లిదండ్రులకు ప్రాక్టికల్‌గా సూచిస్తూ, ఎలా అమలుచేయాలో కూడా వివరించారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత, హాజరైన కుటుంబాలు సుధీర్ సండ్రకు ఆతిథి మర్యాద అందిస్తూ, ప్రత్యేక బహుమతులతో తమ ప్రేమను, ఆదరాభిమానాన్ని తెలియజేశారు. ఇది ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
సుధీర్ సండ్ర తన తర్వాతి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలను
మార్చి 28, 30 తేదీలలో ఆస్టిన్లో,
మార్చి 29న హ్యూస్టన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
"Let's meet!" అంటూ ఆయన్ను కలవాలనుకునే వారికి ఆహ్వానం ఇచ్చారు.