బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. బెట్టింగ్ యాప్స్‌ను సెలెబ్రిటీస్ సైతం ప్రమోషన్ చేస్తున్నారని, మరి వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం యూట్యూబర్లపైనే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సెలబ్రిటీస్‌ను గుర్తించి కేసులు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డబ్బుల కోసం యువతను బలి చేయొద్దని, ఫాలోవర్లను వాడుకోవద్దని నెటిజన్లు కోరుతున్నారు.