రిజర్వేషన్లపై అమిత్ షా సంచలన ప్రకటన

78చూసినవారు
రిజర్వేషన్లపై అమిత్ షా సంచలన ప్రకటన
కుమ్రంభీం జిల్లాలోని కాగజ్ నగర్ ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. ఈసారి అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇచ్చే ఏటీఎంలా మారిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్