మానవాళికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్-19 కంటే 20 రెట్లు ప్రాణాంతకమైన ఈ వైరస్‌కు డిసీజ్ ‘ఎక్స్’(Disease X) అనే పేరును WHO పెట్టింది. ఈ వైరస్‌తో మానవజాతి అంతం కావచ్చేనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇది ఎప్పుడైనా, ఎక్కడైనా పెరుగుతుందని లేదా ఇప్పటికే ఏదో ఒక చోట పెరుగుతూ ఉండొచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు.