మద్యం వివాదానికి సంబంధించిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్‌ను తాజాగా విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ విజిలెన్స్ వెల్లడించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.