భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ ప్రతినిధి షమ మహమ్మద్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ’రోహిత్ శర్మపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది ఎందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. బాడీ షేమింగ్, అవమానకరమైన వ్యాఖ్యలు భ్రాంతికరమైన ప్రకటనలు కాంగ్రెస్ ముఖ్య లక్షణం. అలాంటి మాటలకు ఓ భారతీయుడిగా క్షమాపణలు కోరుతున్నాం అని అన్నారు.