ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ టీమ్‌లోని బాసిస్ట్ మోహిని దే సైతం భర్త మార్క్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెహమాన్ దంపతులు విడిపోతున్నట్లుగా ప్రకటించిన కొద్దిగంటల్లోనే మోహిని సైతం డివోర్స్‌పై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.