దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కోటి మంది యువతకు ప్రముఖ కంపెనీల ద్వారా శిక్షణ కల్పించనున్నారు. 12 నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 నుంచి 24 లోపు ఉండాలి. ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్, లేదా ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు. అభ్యర్థులు https://pminternship.mca.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.