ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 వరకు గుడారాలు మంటలకు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.