ట్రంప్‌తో అంబానీ దంపతుల భేటీ

72చూసినవారు
ట్రంప్‌తో అంబానీ దంపతుల భేటీ
అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దంపతులు ట్రంప్‌తో భేటీ అయ్యారు. ట్రంప్‌ జనవరి 20న రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 18న అంబానీ దంపతులు అమెరికా చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ ఏర్పాటు చేసిన ‘క్యాండిల్‌లైట్‌ డిన్నర్‌’లో అంబానీ దంపతులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్