మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా వారికి ఆర్థిక చేయూత అందిస్తున్నాయి. ఆ పథకాలను పరిశీలిస్తే.. ముద్ర యోజన, బరోడా మహిళా స్వావలంబన , స్త్రీ శక్తి యోజన, అన్నపూర్ణ పథకం. ఈ పథకాల ద్వారా మహిళలు ఎలాంటి హామీ లేకుండానే రూ.20వేల నుంచి రూ.కోటి రుణం పొంది వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. సమీప బ్యాంకులను సంప్రదించి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు.