బొలివియాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫొటోసికి 90 కి.మీ దూరంలో ఓ బస్సు, ట్రక్ ఢీకొని 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా ఒరూరో పండుగ ముగించుకుని వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బొలివియాలో ఇటీవల రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.