దారుణం.. కుక్కను రోడ్డుకేసి కొట్టాడు (వీడియో)

58చూసినవారు
యూపీలోని బాగ్‌పత్‌ సమీపంలో ఇటీవల దారుణం జరిగింది. బరౌత్ నగరంలో ఓ వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించాడు. కుక్కను రెండు కాళ్లు పట్టుకుని రోడ్డుపై నేలకేసి పలుమార్లు కొట్టాడు. దీంతో ఆ కుక్క తీవ్రంగా గాయపడింది. ఏ మాత్రం జాలి లేకుండా ఆ కుక్కను చంపడానికి ప్రయత్నించాడు. నిందితుడి పేరు సవేజ్ అని తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్