VIDEO:దూసుకెళ్లిన కారు.. ఊహించని ప్రమాదం

51చూసినవారు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలుడు కారును వేగంగా నడిపాడు. ఈ క్రమంలో నందనవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేష్ నగర్ చౌక్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న స్టాల్స్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు కారు నడిపిన బాలుడిని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలుడు స్థానిక బీజేపీ నేత కొడుకు అని తెలుస్తోంది. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్