ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా చెన్నై, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన మ్యాజిక్ చూపించాడు. 43 ఏళ్లలో కీపింగ్ చేసిన ధోనీ కేవలం 0.12 సెకన్లలోనే బెయిల్స్ పడగొట్టి అటు అభిమానులను, ఇటు క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 11వ ఓవర్లో చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ వేసిన బంతిని దొరకబుచ్చుకున్న ధోనీ.. అత్యంత వేగంతో వికెట్లకు గిరాటేశాడు. దీంతో ముంబయి బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ షాక్ తో క్రీజును వీడాల్సి వచ్చింది.