నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఉలిక్కిపడటం, పడిపోతున్నట్లు అనిపించడాన్ని హిప్నిక్ జర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. ఇవి రావడానికి సరైన కారణాన్ని గుర్తించలేదు. అయితే, కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి వంటి కారణాలతో ఇవి వస్తాయనేది నిపుణుల మాట. అలాగే, కండరాలు విశ్రాంతి స్థితిలోకి వెళ్లాక, పడిపోతున్నామేమో అని మెదడు తప్పుగా అర్థం చేసుకుని దీనిని నివారించడానికి ఈ జర్క్‌లు ఇస్తుందనే వాదనలూ ఉన్నాయి.