అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన వీరరాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరరాఘవ తనని తాను శివుడి అవతారంగా క్రియేట్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ పేరుతో వీడియోలు చేశాడని, వీటితోనే రామరాజ్యం సాధ్యమని ప్రచారంచేశారన్నారు. రామరాజ్యం పేరుతో దోపిడీ, భౌతిక దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. రాఘవకు గతంలోనూ నేరచరిత్ర ఉందని, అతన్ని అరెస్టు చేయకపోతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని స్పష్టం చేశారు.