మనదేశంలో బాగా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ పానీపూరి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టపడి తినే ఆహారం ఇదే. అయితే నాగపూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఆసక్తికర ప్రకటన విడుదల చేశారు. ఒక్కసారి రూ.99,000 చెల్లిస్తే జీవితాంతం ఫ్రీగా తినొచ్చని చెప్పాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరు నగదు కూడా చెల్లించారట. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.