బంగ్లాదేశ్‌లో అరెస్టయిన హిందూ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాది రామన్ రాయ్‌పై తాజాగా ఇస్లామిస్టులు దాడికి పాల్పడ్డారు. 'ఇస్లామిస్టులు అతని ఇంటిపై క్రూరంగా దాడి చేశారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. చిన్మోయ్ తరపున మాట్లాడటమే అతను చేసిన అతి పెద్ద తప్పు' అని ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారమన్ దాస్ ఎక్స్ వేదికగా తెలిపారు.