AP: కృష్ణా జిల్లాలోని పెడన పట్టణంలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. పేరిశెట్టి చరణ్ అనే వ్యక్తి మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన బెనర్జీ, శివలపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.