రైలుతో సెల్ఫీకి యత్నం.. ప్రాణాలు కోల్పోయిన యువతి (Video)

75చూసినవారు
ప్రాణాలు పోతున్న కూడా యువత ‘సెల్ఫీ మోజు’ను ఆపడం లేదు. తాజాగా మెక్సికోలోని హిడాల్గో సమీపంలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూసేందుకు అనేకమంది ఔత్సాహికులు ట్రాక్‌ల వద్ద గుమిగూడారు. ఇంతలో ఓ యువతి పట్టాలకు మరింత దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు ఆమెను ఢీకొట్టడంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్