మహిళను ఢీకొట్టి ఆటో బోల్తా.. ఆటో పైకి లేపి తల్లిని కాపాడిన బాలిక (వీడియో)

83చూసినవారు
కర్ణాటకలోని మంగళూరులో శుక్రవారం రాత్రి ఊహించని ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. అనంతరం ఆటో బోల్తా పడింది. ఆటో కింద చిక్కుకున్న మహిళ స్పృహ కోల్పోయింది. దూరం నుంచి ఇది చూసిన బాలిక పరుగు పరుగున అక్కడికి వచ్చింది. ఆటోను పైకి లేపి, దాని కింద ఉన్న తన తల్లిని కాపాడింది. ఇతరులు సైతం సాయం చేసి, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్