పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదైంది. ఓ యూట్యూబర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌సాధు అనే అతను ఓ న్యూస్ ఛానల్‌లో ప్రభాస్‌కు సర్జరీ జరిగిందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ క్రమంలో సురేష్ కొండి అనే వ్యక్తి ఫోన్ చేసి ఆ వీడియోను డిలీట్ చేయాలని బెదిరించాడు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నారని విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.