ఈ ఏడాది తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాష్ట్రానికి సమర్థవంతమైన పాలన అందుతుందని, ప్రజలు సుభిక్షమైన, ఇబ్బందులు లేని జీవనం పొందుతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.