హైదరాబాద్ లో నిర్వహించే ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ను నిషేధిస్తూ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్ 100కు ఫిర్యాదులు పెరగడంతో డీజే సౌండ్ సిస్టమ్‌ను నిషేదించింది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.